Logo

ఆదికాండము అధ్యాయము 18 వచనము 28

సంఖ్యాకాండము 14:17 యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును

సంఖ్యాకాండము 14:18 దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాటచొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక

సంఖ్యాకాండము 14:19 ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా

1రాజులు 20:32 కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రదుకనిమ్మని మనవిచేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై యున్నాడా అని యడిగెను.

1రాజులు 20:33 అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏలాగుననున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటనుబట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్లి అతనిని తోడుకొని రండనెను. బెన్హదదు తనయొద్దకు రాగా అతడు తన రథముమీద అతని ఎక్కించుకొనెను.

యోబు 23:3 ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.

యోబు 23:4 ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.

ఆదికాండము 18:26 యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను

ఆదికాండము 18:29 అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబదిమందినిబట్టి నాశనముచేయక యుందునని చెప్పగా

దానియేలు 2:18 తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవునివలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.