Logo

ఆదికాండము అధ్యాయము 19 వచనము 33

లేవీయకాండము 18:6 మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.

లేవీయకాండము 18:7 నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

సామెతలు 20:1 ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానము లేనివారు.

సామెతలు 23:29 ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?

సామెతలు 23:30 ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.

సామెతలు 23:31 ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.

సామెతలు 23:32 పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.

సామెతలు 23:33 విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు

సామెతలు 23:34 నీవు నడిసముద్రమున పండుకొను వానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.

సామెతలు 23:35 నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.

హబక్కూకు 2:15 తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.

హబక్కూకు 2:16 ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచుకొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీద పడును.