Logo

ఆదికాండము అధ్యాయము 23 వచనము 8

1రాజులు 2:17 ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదని చెప్పడనెను.

లూకా 7:3 శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను.

లూకా 7:4 వారు యేసునొద్దకు వచ్చి నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు;

హెబ్రీయులకు 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.

1యోహాను 2:1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.

1యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు; మన పాపములకు మాత్రమే కాదు. సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.

ఆదికాండము 49:30 హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రులయొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశానభూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను.

2సమూయేలు 24:21 దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,