Logo

ఆదికాండము అధ్యాయము 28 వచనము 8

ఆదికాండము 28:1 ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.

ఆదికాండము 24:3 నేను ఎవరిమధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక

ఆదికాండము 26:34 ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసికొనెను.

ఆదికాండము 26:35 వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

1సమూయేలు 8:6 మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.

ఆదికాండము 27:46 మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.

ఆదికాండము 48:17 యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండియెత్తి

నిర్గమకాండము 21:8 దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలు కానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.

ద్వితియోపదేశాకాండము 25:6 చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.

యెహోషువ 22:30 ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులును, అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులును రూబేనీయులును గాదీయులును మనష్షీయులును చెప్పిన మాటలను విని సంతోషించిరి.