Logo

ఆదికాండము అధ్యాయము 40 వచనము 2

కీర్తనలు 76:10 నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు.

సామెతలు 16:14 రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.

సామెతలు 19:12 రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచువంటిది.

సామెతలు 19:19 మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.

సామెతలు 27:4 క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?

అపోస్తలులకార్యములు 12:20 తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధానపడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.

1దినవృత్తాంతములు 27:27 ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.

ఆదికాండము 12:15 ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో యెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.

ఆదికాండము 40:16 అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను.

ఆదికాండము 41:10 ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి యింట కావలిలో ఉంచెను.

నెహెమ్యా 1:11 యెహోవా చెవి యొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.