Logo

ఆదికాండము అధ్యాయము 45 వచనము 3

మత్తయి 14:27 వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా

అపోస్తలులకార్యములు 7:13 వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసికొనెను; అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను.

అపోస్తలులకార్యములు 9:5 ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును;

యోబు 4:5 అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.

యోబు 23:15 కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.

జెకర్యా 12:10 దావీదు సంతతివారి మీదను యెరూషలేము నివాసులమీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

మత్తయి 14:26 ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

మార్కు 6:50 అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను.

లూకా 5:8 సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్ల యెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను.

లూకా 24:37 అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.

లూకా 24:38 అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల?

ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

ఆదికాండము 50:18 మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా

నిర్గమకాండము 4:18 అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి సెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా ఇత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను

నిర్గమకాండము 34:31 మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగివచ్చిరి, మోషే వారితో మాటలాడెను.