Logo

ఆదికాండము అధ్యాయము 5 వచనము 32

ఆదికాండము 6:10 షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.

ఆదికాండము 7:13 ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.

ఆదికాండము 9:18 ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.

ఆదికాండము 9:19 ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.

ఆదికాండము 9:22 అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.

ఆదికాండము 9:23 అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచివెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు

ఆదికాండము 9:24 అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసిన దానిని తెలిసికొని

ఆదికాండము 9:25 కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

ఆదికాండము 9:26 మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక కనాను అతనికి దాసుడగును.

ఆదికాండము 9:27 దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.

ఆదికాండము 10:1 ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.

ఆదికాండము 10:21 మరియు ఏబెరు యొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.

ఆదికాండము 10:32 వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమిమీద వ్యాపించెను.

1దినవృత్తాంతములు 1:4 నోవహు షేము హాము యాపెతు.

1దినవృత్తాంతములు 1:5 యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

1దినవృత్తాంతములు 1:6 గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.

1దినవృత్తాంతములు 1:7 యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదానీము.

1దినవృత్తాంతములు 1:8 హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.

1దినవృత్తాంతములు 1:9 కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.

1దినవృత్తాంతములు 1:10 కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరాక్రమశాలులలో మొదటివాడు.

1దినవృత్తాంతములు 1:11 లూదీయులు అనామీయులు లెహాబీయులు నప్తుహీయులు

1దినవృత్తాంతములు 1:12 పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.

1దినవృత్తాంతములు 1:13 కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

1దినవృత్తాంతములు 1:14 యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు

1దినవృత్తాంతములు 1:15 హివ్వీయులు అర్కీయులు సీనీయులు

1దినవృత్తాంతములు 1:16 అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.

1దినవృత్తాంతములు 1:17 షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.

1దినవృత్తాంతములు 1:18 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

1దినవృత్తాంతములు 1:19 ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

1దినవృత్తాంతములు 1:20 యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

1దినవృత్తాంతములు 1:21 హదోరమును ఊజాలును దిక్లానును

1దినవృత్తాంతములు 1:22 ఏబాలును అబీమాయేలును షేబను

1దినవృత్తాంతములు 1:23 ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.

1దినవృత్తాంతములు 1:24 షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ

1దినవృత్తాంతములు 1:25 సెరూగు నాహోరు తెరహు

1దినవృత్తాంతములు 1:26 అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.

1దినవృత్తాంతములు 1:27 అబ్రాహాము కుమారులు,

1దినవృత్తాంతములు 1:28 ఇస్సాకు ఇష్మాయేలు.

లూకా 3:36 షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,

ఆదికాండము 7:6 ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు.

ఆదికాండము 9:29 నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.