Logo

ఆదికాండము అధ్యాయము 7 వచనము 2

ఆదికాండము 7:8 దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకువాటన్నిటిలోను,

ఆదికాండము 6:19 మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను.

ఆదికాండము 6:20 నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకువాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీయొద్దకు అవి వచ్చును.

ఆదికాండము 6:21 మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.

ఆదికాండము 8:20 అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.

లేవీయకాండము 11:1 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

లేవీయకాండము 11:2 మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి భూమిమీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును;

లేవీయకాండము 11:3 జంతువులలో ఏది డెక్కలుగలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని

లేవీయకాండము 11:4 నెమరువేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.

లేవీయకాండము 11:5 పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.

లేవీయకాండము 11:6 కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.

లేవీయకాండము 11:7 పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.

లేవీయకాండము 11:8 వాటి మాంసమును మీరు తినకూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.

లేవీయకాండము 11:9 జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములోనేమి, నదులలోనేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.

లేవీయకాండము 11:10 సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నియు మీకు హేయములు;

లేవీయకాండము 11:11 అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.

లేవీయకాండము 11:12 నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.

లేవీయకాండము 11:13 పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,

లేవీయకాండము 11:14 క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,

లేవీయకాండము 11:15 ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,

లేవీయకాండము 11:16 కపిరిగాడు, కోకిల,

లేవీయకాండము 11:17 ప్రతివిధమైన డేగ,

లేవీయకాండము 11:18 పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,

లేవీయకాండము 11:19 సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.

లేవీయకాండము 11:20 రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరములన్నియు మీకు హేయములు.

లేవీయకాండము 11:21 అయితే నాలుగు కాళ్లతో చరించుచు నేలగంతులు వేయుటకు కాళ్లమీద తొడలుగల పురుగులన్ని తినవచ్చును.

లేవీయకాండము 11:22 నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.

లేవీయకాండము 11:23 నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.

లేవీయకాండము 11:24 వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 11:25 వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 11:26 రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరువేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును.

లేవీయకాండము 11:27 నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;

లేవీయకాండము 11:28 వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును; అవి మీకు అపవిత్రమైనవి.

లేవీయకాండము 11:29 నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా, చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి,

లేవీయకాండము 11:30 ఊసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి యెలుక.

లేవీయకాండము 11:31 ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 11:32 వాటిలో చచ్చినదాని కళేబరము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది చెక్కపాత్రయే గాని బట్టయే గాని చర్మమే గాని సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్రమగును.

లేవీయకాండము 11:33 వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగులగొట్టవలెను.

లేవీయకాండము 11:34 తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.

లేవీయకాండము 11:35 వాటి కళేబరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.

లేవీయకాండము 11:36 అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును.

లేవీయకాండము 11:37 వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనములమీద పడినను అవి అపవిత్రములు కావు గాని

లేవీయకాండము 11:38 ఆ విత్తనములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.

లేవీయకాండము 11:39 మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చినయెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 11:40 దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 11:41 నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.

లేవీయకాండము 11:42 నేలమీద ప్రాకు జీవరాసులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు.

లేవీయకాండము 11:43 ప్రాకు జీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.

లేవీయకాండము 11:44 నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులైయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.

లేవీయకాండము 11:45 నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.

లేవీయకాండము 11:46 అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు

లేవీయకాండము 11:47 జంతువులను గూర్చియు, పక్షులను గూర్చియు, జలచరములైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి యిదే అని చెప్పుమనెను.

ద్వితియోపదేశాకాండము 14:1 మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడిచేసికొనకూడదు.

ద్వితియోపదేశాకాండము 14:2 ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమిమీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.

ద్వితియోపదేశాకాండము 14:3 నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవేవనగా

ద్వితియోపదేశాకాండము 14:4 ఎద్దు, గొఱ్ఱపిల్ల, మేకపిల్ల,

ద్వితియోపదేశాకాండము 14:5 దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱ అనునవే.

ద్వితియోపదేశాకాండము 14:6 జంతువులలో రెండు డెక్కలుగలదై నెమరువేయు జంతువును తినవచ్చును.

ద్వితియోపదేశాకాండము 14:7 నెమరువేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగలవాటిలోనిదే కాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు.

ద్వితియోపదేశాకాండము 14:8 మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు.

ద్వితియోపదేశాకాండము 14:9 నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా, రెక్కలు పొలుసులుగల వాటినన్నిటిని తినవచ్చును.

ద్వితియోపదేశాకాండము 14:10 రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తినకూడదు అది మీకు హేయము.

ద్వితియోపదేశాకాండము 14:11 పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును.

ద్వితియోపదేశాకాండము 14:12 మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు,

ద్వితియోపదేశాకాండము 14:13 పెద్ద బోరువ, క్రౌంచుపక్షి,

ద్వితియోపదేశాకాండము 14:14 పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద,

ద్వితియోపదేశాకాండము 14:15 ప్రతి విధమైన కాకి,

ద్వితియోపదేశాకాండము 14:16 నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల,

ద్వితియోపదేశాకాండము 14:17 ప్రతి విధమైన డేగ, పైడికంటె,

ద్వితియోపదేశాకాండము 14:18 గుడ్లగూబ, హంస, గూడబాతు,

ద్వితియోపదేశాకాండము 14:19 తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి.

ద్వితియోపదేశాకాండము 14:20 ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును.

ద్వితియోపదేశాకాండము 14:21 చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.

అపోస్తలులకార్యములు 10:11 ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను.

అపోస్తలులకార్యములు 10:12 అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను.

అపోస్తలులకార్యములు 10:13 అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను.

అపోస్తలులకార్యములు 10:14 అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా

అపోస్తలులకార్యములు 10:15 దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను.

లేవీయకాండము 10:10 మీరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును,

యెహెజ్కేలు 44:23 ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు

ఆదికాండము 7:14 వీరే కాదు; ఆ యా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆ యా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆ యా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆ యా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను.

ఆదికాండము 7:16 ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.

లేవీయకాండము 11:4 నెమరువేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.

యెహోషువ 6:4 ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను.