Logo

సామెతలు అధ్యాయము 4 వచనము 22

సామెతలు 3:3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.

సామెతలు 3:21 నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము

సామెతలు 2:1 నా కుమారుడా, నీవు నా మాటలనంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల

కీర్తనలు 40:8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

యోబు 22:22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.

సామెతలు 4:6 జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.

సామెతలు 5:7 కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.

సామెతలు 6:21 వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.

సామెతలు 19:8 బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలుపొందును.