Logo

సామెతలు అధ్యాయము 10 వచనము 24

సామెతలు 14:9 మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు.

సామెతలు 15:21 బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును.

సామెతలు 26:18 తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు

సామెతలు 26:19 తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.

ప్రసంగి 11:9 యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము;

2సమూయేలు 2:14 అబ్నేరు లేచి మన యెదుట యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను.

సామెతలు 2:14 కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.

యిర్మియా 11:15 దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.