Logo

సామెతలు అధ్యాయము 12 వచనము 28

సామెతలు 13:4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.

సామెతలు 23:2 నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.

సామెతలు 26:15 సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.

సామెతలు 15:16 నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.

సామెతలు 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితో కూడిన కొంచెమే శ్రేష్ఠము.

కీర్తనలు 37:16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.

సామెతలు 12:24 శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టిపనులు చేయవలసి వచ్చును.

సామెతలు 19:24 సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.

సామెతలు 21:25 సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.

సామెతలు 26:14 ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.

ప్రసంగి 4:5 బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును.