Logo

సామెతలు అధ్యాయము 18 వచనము 1

సామెతలు 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.

యోబు 13:5 మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.

ప్రసంగి 5:3 విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.

ప్రసంగి 10:3 బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.

ప్రసంగి 10:14 కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు; నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో యెవరు తెలియజేతురు?

యోబు 32:16 కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందునా?

సామెతలు 10:19 విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.

సామెతలు 21:23 నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

సామెతలు 30:32 నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీచేతితో నోరు మూసికొనుము.