Logo

సామెతలు అధ్యాయము 23 వచనము 4

సామెతలు 23:6 ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.

కీర్తనలు 141:4 పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.

దానియేలు 1:8 రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొనగా

లూకా 21:34 మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.

ఎఫెసీయులకు 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని

ఆదికాండము 27:14 అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపఱచెను.

సామెతలు 1:19 ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.