Logo

సామెతలు అధ్యాయము 30 వచనము 24

సామెతలు 19:13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము.

సామెతలు 21:9 గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.

సామెతలు 21:19 ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.

సామెతలు 27:15 ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము

సామెతలు 29:21 ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును.

ఆదికాండము 15:3 మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా

ఆదికాండము 16:4 అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను.