Logo

దానియేలు అధ్యాయము 1 వచనము 8

దానియేలు 1:3 రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,

దానియేలు 1:10 మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడనేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు.

దానియేలు 1:11 నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను.

దానియేలు 4:8 కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలనువాడు నా యెదుటికి వచ్చెను; పరిశుద్ధదేవతల ఆత్మ అతనియందుండెను, కావున నేనతనికి నా కలను చెప్పితిని.

దానియేలు 5:12 ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును.

ఆదికాండము 41:45 మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి, అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లిచేసెను.

2రాజులు 23:34 యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.

2రాజులు 24:17 మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.

దానియేలు 2:49 అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసికొనగా రాజు షద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను; అయితే దానియేలు రాజుసన్నిధిని ఉండెను.

దానియేలు 3:12 రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.

దానియేలు 3:13 అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి.

దానియేలు 3:14 అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా?

దానియేలు 3:15 బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన యెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నాచేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?

దానియేలు 3:16 షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ, యిందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు.

దానియేలు 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను

దానియేలు 3:18 రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.

దానియేలు 3:19 అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.

దానియేలు 3:20 మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువ నంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా

దానియేలు 3:21 వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి.

దానియేలు 3:22 రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.

దానియేలు 3:23 షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో పడగా

దానియేలు 3:24 రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితివిుగదా యని తన మంత్రుల నడిగెను. వారు రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి.

దానియేలు 3:25 అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.

దానియేలు 3:26 అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.

దానియేలు 3:27 అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.

దానియేలు 3:28 నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.

దానియేలు 3:29 కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములోగాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.

దానియేలు 3:30 అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.

1సమూయేలు 8:15 మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును.

2దినవృత్తాంతములు 18:8 అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములోనున్న యొకని పిలిపించి ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను.

ఎస్తేరు 2:7 తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలితండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను.

దానియేలు 2:17 అప్పుడు దానియేలు తన యింటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి

దానియేలు 2:26 రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా

దానియేలు 4:19 అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావమువలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తెషాజరు నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,

దానియేలు 10:1 పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసినదాయెను.