Logo

దానియేలు అధ్యాయము 12 వచనము 1

యోవేలు 2:20 మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పారదోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లువాసన కొట్టును.

జెకర్యా 14:8 ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగుననే జరుగును.

దానియేలు 11:16 వచ్చినవాని కెదురుగా ఎవరును నిలువలేక పోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందముగల ఆ దేశములో అతడుండగా అది అతని బలమువలన పాడైపోవును.

దానియేలు 11:41 అతడు ఆనందదేశమున ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులలో ముఖ్యులును అతనిచేతిలోనుండి తప్పించుకొనెదరు.

కీర్తనలు 48:2 ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వ తము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది

యెషయా 2:2 అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

యెషయా 14:13 నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

మీకా 4:2 కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.

2దెస్సలోనీకయులకు 2:4 ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.

దానియేలు 2:35 అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.

దానియేలు 7:26 అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును.

దానియేలు 8:25 మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును.

యెహెజ్కేలు 38:22 తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారిమీదను అతనితో కూడిన జనములనేకములమీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.

యెహెజ్కేలు 38:23 నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారియెదుట నన్ను తెలియపరచుకొందును.

యెహెజ్కేలు 39:2 నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, ఉత్తరదిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి

2దెస్సలోనీకయులకు 2:8 అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

ప్రకటన 13:10 ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.

ప్రకటన 14:14 మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడై యుండెను ఆయన శిరస్సుమీద సువర్ణ కిరీటమును,చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.

ప్రకటన 14:15 అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరు పండియున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను

ప్రకటన 14:16 మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.

ప్రకటన 14:17 ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలి వచ్చెను; ఇతనియొద్దను వాడిగల కొడవలి యుండెను.

ప్రకటన 14:18 మరియొక దూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.

ప్రకటన 14:19 కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను

ప్రకటన 14:20 ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.

ప్రకటన 19:19 మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

ప్రకటన 19:20 అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి

ప్రకటన 19:21 కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్నవాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.

ప్రకటన 20:2 అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,

ప్రకటన 20:9 వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

సంఖ్యాకాండము 24:24 కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులుకూడ నిత్యనాశనము పొందుదురనెను.

కీర్తనలు 7:9 హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,

కీర్తనలు 78:54 తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను.

కీర్తనలు 96:9 పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.

యిర్మియా 3:19 నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెదననుకొని యుంటిని. నీవు నా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా?

దానియేలు 7:11 అప్పుడు నేను చూచుచుండగా, ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.

దానియేలు 8:9 ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి యొక చిన్నకొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.

దానియేలు 12:1 ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

యోవేలు 3:17 అన్యులికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరిశుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివ సించుచున్నానని మీరు తెలిసికొందురు.

మత్తయి 2:19 హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై

ప్రకటన 11:18 జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.

ప్రకటన 17:8 నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధజలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని అశ్చర్యపడుదురు.

ప్రకటన 19:20 అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి