Logo

మీకా అధ్యాయము 3 వచనము 11

యిర్మియా 22:13 నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.

యిర్మియా 22:14 వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో1 రంగువేయుచు నున్నాడే;

యిర్మియా 22:15 నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా?

యిర్మియా 22:16 అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసికొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.

యిర్మియా 22:17 అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.

యెహెజ్కేలు 22:25 ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు, గర్జించుచుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు,

యెహెజ్కేలు 22:26 దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైనదానికిని సాధారణమైనదానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలిసికొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను.

యెహెజ్కేలు 22:27 దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.

యెహెజ్కేలు 22:28 మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టి సోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారైయున్నారు.

హబక్కూకు 2:9 తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.

హబక్కూకు 2:10 నీవు చాలమంది జనములను నాశనము చేయుచు నీమీద నీవే నేరస్థాపన చేసియున్నావు, నీ దురాలోచనవలన నీ యింటివారికి అవమానము తెచ్చియున్నావు.

హబక్కూకు 2:11 గోడలలోని రాళ్లు మొఱ్ఱ పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి.

హబక్కూకు 2:12 నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ.

జెఫన్యా 3:3 దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.

మత్తయి 27:25 అందుకు ప్రజలందరు వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.

యోహాను 11:50 మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 27:25 నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

సామెతలు 1:19 ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.

యెషయా 26:10 దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.

యెషయా 59:3 మీచేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

యెహెజ్కేలు 11:6 ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీచేత హతులైన వారితో వీధులు నిండియున్నవి.

యెహెజ్కేలు 12:19 దేశములోని జనులకీలాగు ప్రకటించుము యెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలు దేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దానిలోనున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు

యెహెజ్కేలు 21:24 కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ అతిక్రమములు బయలుపడుటవలన మీ సమస్త క్రియలలోనుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొనినందునను, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినందునను మీరు చెయ్యి చిక్కియున్నారు.

యెహెజ్కేలు 23:37 వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి.

మీకా 3:1 నేనీలాగు ప్రకటించితిని యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా.

హబక్కూకు 2:12 నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ.

యోహాను 18:28 వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.