Logo

మీకా అధ్యాయము 4 వచనము 10

యిర్మియా 4:21 నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచుచుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?

యిర్మియా 8:19 యెహోవా సీయోనులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము వినబడుచున్నది; వారి విగ్రహములచేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి?

యిర్మియా 30:6 మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?

యిర్మియా 30:7 అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.

యెషయా 3:1 ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు

యెషయా 3:2 శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను

యెషయా 3:3 సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములోనుండియు తీసివేయును.

యెషయా 3:4 బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.

యెషయా 3:5 ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.

యెషయా 3:6 ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై యుందువు ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును

యెషయా 3:7 అతడు ఆ దినమున కేకవేసినేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.

విలాపవాక్యములు 4:20 మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.

హోషేయ 3:4 నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాల దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.

హోషేయ 10:3 రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు.

హోషేయ 13:10 నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి?

హోషేయ 13:11 కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను.

యెషయా 13:8 జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరిచూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.

యెషయా 21:3 కావున నా నడుము బహు నొప్పిగానున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టియున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.

యెషయా 26:17 యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము.

యిర్మియా 22:23 లెబానోను నివాసినీ, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలువేయుదువు గదా!

యిర్మియా 30:6 మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?

యిర్మియా 50:43 బబులోను రాజు వారి సమాచారము విని దుర్బలుడాయెను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను.

ఆదికాండము 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

యెషయా 30:19 సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.

యిర్మియా 6:24 దానిగూర్చిన వర్తమానము విని మాచేతులు బలహీనమగుచున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.

యిర్మియా 48:41 కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడియున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

హోషేయ 13:13 ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.

మార్కు 13:8 జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము.

1దెస్సలోనీకయులకు 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు