Logo

మార్కు అధ్యాయము 1 వచనము 18

యెహెజ్కేలు 47:10 మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లాయీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.

మత్తయి 4:19 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగాచేతునని వారితో చెప్పెను;

మత్తయి 4:20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

లూకా 5:10 ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయమొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 2:38 పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

అపోస్తలులకార్యములు 2:39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 2:40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను.

అపోస్తలులకార్యములు 2:41 కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.

మత్తయి 10:2 ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;

మత్తయి 13:47 మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది.

మత్తయి 19:27 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా

మార్కు 2:14 ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను.