Logo

మార్కు అధ్యాయము 1 వచనము 29

మార్కు 1:45 అయితే వాడు వెళ్లి దానినిగూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి

మీకా 5:4 ఆయన నిలిచి యెహోవా బలముపొంది తన దేవుడైన యెహోవా నామమహాత్మ్యమునుబట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతములవరకు ప్రబలుడగును,

మత్తయి 4:24 ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరిని, దయ్యము పట్టినవారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

మత్తయి 9:31 అయినను వారు వెళ్లి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.

లూకా 4:17 ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

లూకా 4:37 అంతట ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను.

మత్తయి 14:35 అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయనయొద్దకు తెప్పించి

మార్కు 6:14 ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను.

లూకా 4:14 అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగివెళ్లెను; ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.

లూకా 5:15 అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను.

లూకా 7:17 ఆయనను గూర్చిన యీ సమాచారము యూదయ యందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను.