Logo

యోహాను అధ్యాయము 4 వచనము 5

మత్తయి 10:5 యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని

మత్తయి 10:6 ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱలయొద్దకే వెళ్లుడి.

లూకా 2:49 ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను;

లూకా 9:51 ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు

లూకా 9:52 ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని

లూకా 17:11 ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను.

1రాజులు 13:32 యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను.

1రాజులు 16:24 అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండమీద పట్టణమొకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరునుబట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను1 అను పేరు పెట్టెను.

1యోహాను 5:11 దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే.