Logo

యోహాను అధ్యాయము 4 వచనము 44

మత్తయి 15:21 యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా,

మత్తయి 15:22 ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

మత్తయి 15:23 అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి ఈమె మనవెంబడి వచ్చి కేకలువేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా

మత్తయి 15:24 ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదనెను

మార్కు 7:27 ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను.

మార్కు 7:28 అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను.

రోమీయులకు 15:8 నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతిగలవారికి పరిచారకుడాయెను.

యోహాను 4:46 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగివచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగియైయుండెను.

యోహాను 1:42 యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.

మత్తయి 4:13 నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

మత్తయి 4:12 యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి

లూకా 4:14 అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగివెళ్లెను; ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.