Logo

యోహాను అధ్యాయము 9 వచనము 7

మార్కు 7:33 సమూహములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొనిపోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి

మార్కు 8:23 ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వానిమీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా,

ప్రకటన 3:18 నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.

యెహోషువ 6:12 ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.

2సమూయేలు 5:23 దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్లవద్దు చుట్టు తిరిగిపోయి, కంబళిచెట్లకు ఎదురుగా వారిమీద పడుము.

2రాజులు 2:21 అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగకపోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.

2రాజులు 4:41 అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.

2రాజులు 6:6 ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను.

1దినవృత్తాంతములు 14:14 దావీదు తిరిగి దేవునియొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి

యెషయా 38:21 మరియు యెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.

మత్తయి 9:29 వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.

మత్తయి 20:34 కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి.

యోహాను 9:11 వాడు యేసు అను నొక మనుష్యుడు బురదచేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.

యోహాను 10:21 మరి కొందరు ఇవి దయ్యము పట్టినవాని మాటలు కావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.

యోహాను 11:37 వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.