Logo

యోహాను అధ్యాయము 9 వచనము 18

యోహాను 4:19 అప్పుడా స్త్రీ అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.

యోహాను 6:14 ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.

లూకా 24:19 ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.

అపోస్తలులకార్యములు 2:22 ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.

అపోస్తలులకార్యములు 3:22 మోషే యిట్లనెను ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.

అపోస్తలులకార్యములు 3:23 ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.

అపోస్తలులకార్యములు 3:24 మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.

అపోస్తలులకార్యములు 3:25 ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.

అపోస్తలులకార్యములు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

అపోస్తలులకార్యములు 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత (అనగా సాతానుచే) పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను

మత్తయి 16:14 వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.

మత్తయి 21:11 జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.

మార్కు 6:15 ఇతరులు ఈయన ఏలీయా అనియు, మరికొందరు ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి.

లూకా 7:16 అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.

లూకా 9:19 వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయాయనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి.