Logo

గలతీయులకు అధ్యాయము 2 వచనము 12

అపోస్తలులకార్యములు 15:30 అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి.

అపోస్తలులకార్యములు 15:31 వారు దానిని చదువుకొని అందువలన ఆదరణపొంది సంతోషించిరి.

అపోస్తలులకార్యములు 15:32 మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరులనాదరించి స్థిరపరచిరి.

అపోస్తలులకార్యములు 15:33 వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరుల యొద్దనుండి తమ్మును పంపిన

అపోస్తలులకార్యములు 15:34 వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి.

అపోస్తలులకార్యములు 15:35 అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి, యింక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.

గలతీయులకు 2:5 సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు.

2కొరిందీయులకు 5:16 కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.

2కొరిందీయులకు 11:5 నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.

2కొరిందీయులకు 11:21 మేము బలహీనులమైయున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగియున్నాడో, ఆ విషయమందు నేను కూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.

2కొరిందీయులకు 11:22 వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే.

2కొరిందీయులకు 11:23 వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరియెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరివిశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.

2కొరిందీయులకు 11:24 యూదులచేత అయిదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;

2కొరిందీయులకు 11:25 ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.

2కొరిందీయులకు 11:26 అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని

2కొరిందీయులకు 11:27 ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

2కొరిందీయులకు 11:28 ఇవియును గాక సంఘములన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది.

2కొరిందీయులకు 12:11 నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువవాడను కాను.

1తిమోతి 5:20 ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.

యూదా 1:3 ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.

నిర్గమకాండము 32:21 అప్పుడు మోషే నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా

నిర్గమకాండము 32:22 అహరోను నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు.

సంఖ్యాకాండము 20:12 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నులయెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను.

యిర్మియా 1:17 కాబట్టి నీవు నడుముకట్టుకొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటన చేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.

యోనా 1:3 అయితే యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.

యోనా 4:3 నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను.

యోనా 4:4 అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.

యోనా 4:9 అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.

మత్తయి 16:17 అందుకు యేసు సీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలుపరచలేదు.

మత్తయి 16:18 మరియు నీవు పేతురువు? ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

మత్తయి 16:23 అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతరకారణమై యున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను

అపోస్తలులకార్యములు 15:37 అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొనిపోవుటకు బర్నబా యిష్టపడెను.

అపోస్తలులకార్యములు 15:38 అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను.

అపోస్తలులకార్యములు 15:39 వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను;

అపోస్తలులకార్యములు 23:1 పౌలు మహాసభవారిని తేరిచూచి సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని యెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.

అపోస్తలులకార్యములు 23:2 అందుకు ప్రధానయాజకుడైన అననీయ అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా

అపోస్తలులకార్యములు 23:3 పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను.దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి.

అపోస్తలులకార్యములు 23:4 అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నదనెను.

అపోస్తలులకార్యములు 23:5 వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణను గూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.

యాకోబు 3:2 అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకుని) శక్తిగలవాడగును

1యోహాను 1:8 మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.

1యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

1యోహాను 1:10 మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.

ఆదికాండము 20:2 అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.

నిర్గమకాండము 23:2 దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;

లేవీయకాండము 19:17 నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీమీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.

1సమూయేలు 27:10 ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదు యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.

2దినవృత్తాంతములు 26:18 వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధ స్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా

నెహెమ్యా 5:7 అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి

యోబు 21:31 వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు? వారు చేసినదానిని బట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు?

యోబు 27:5 మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.

యోబు 34:4 న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసికొందము రండి.

కీర్తనలు 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను.

సామెతలు 9:8 అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.

సామెతలు 28:23 నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.

సామెతలు 29:25 భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.

ప్రసంగి 4:10 వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును.

యెహెజ్కేలు 3:21 అయితే పాపము చేయవలదని నీతిగలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానినయెడల అతడు అవశ్యముగా బ్రదుకును, నీ మట్టుకు నీవును (ఆత్మను) తప్పించుకొందువు.

మార్కు 12:14 వారు వచ్చి బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మేమెరుగుదుము; నీవు మోమోటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా?

లూకా 17:3 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందినయెడల అతని క్షమించుము.

యోహాను 9:22 వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలివేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి.

యోహాను 18:25 సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడు నేను కాను, నేనెరుగననెను.

అపోస్తలులకార్యములు 14:26 అక్కడనుండి ఓడ యెక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై, మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగివచ్చిరి.

గలతీయులకు 2:6 ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.

గలతీయులకు 2:14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవైయుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

గలతీయులకు 2:17 కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.

గలతీయులకు 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను.

1తిమోతి 5:1 వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.