Logo

గలతీయులకు అధ్యాయము 2 వచనము 13

గలతీయులకు 2:9 స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

అపోస్తలులకార్యములు 21:18 మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడ యాకోబు నొద్దకు వచ్చెను.

అపోస్తలులకార్యములు 21:19 అతడు వారిని కుశలమడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను.

అపోస్తలులకార్యములు 21:20 వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.

అపోస్తలులకార్యములు 21:21 అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు

అపోస్తలులకార్యములు 21:22 కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.

అపోస్తలులకార్యములు 21:23 కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు.

అపోస్తలులకార్యములు 21:24 నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితో కూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్నుగూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు

అపోస్తలులకార్యములు 21:25 అయితే విశ్వసించిన అన్యజనులనుగూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి

అపోస్తలులకార్యములు 10:28 అప్పుడతడు అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదు అని దేవుడు నాకు చూపించియున్నాడు

అపోస్తలులకార్యములు 11:3 నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.

ఎఫెసీయులకు 2:15 ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

ఎఫెసీయులకు 2:19 కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.

ఎఫెసీయులకు 2:20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

ఎఫెసీయులకు 2:21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది.

ఎఫెసీయులకు 2:22 ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.

ఎఫెసీయులకు 3:6 ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారనునదియే.

యెషయా 65:5 వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.

లూకా 15:2 పరిసయ్యులును శాస్త్రులును అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.

1దెస్సలోనీకయులకు 5:22 ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.

సామెతలు 29:25 భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.

యెషయా 57:11 ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగా నుండినందుననే గదా నీవు నాకు భయపడుట లేదు?

మత్తయి 26:69 పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.

మత్తయి 26:70 అందుకతడు నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరియెదుట అనెను.

మత్తయి 26:71 అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరియొక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా

మత్తయి 26:72 అతడు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.

మత్తయి 26:73 కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.

మత్తయి 26:74 అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను

మత్తయి 26:75 కనుక కోడి కూయకమునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి యేడ్చెను.

ఆదికాండము 12:13 నీవలన నాకు మేలు కలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను.

ఆదికాండము 20:2 అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.

1సమూయేలు 21:2 దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీ కాజ్ఞాపించి పంపిన పని యేదో అదెవనితోనైనను చెప్పవద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;

2రాజులు 10:29 అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూకూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు.

ప్రసంగి 10:1 బుక్కావాని తైలములో చచ్చిన యీగలు పడుటచేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును.

లూకా 5:38 అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను.

యోహాను 7:13 అయితే యూదులకు భయపడి ఆయననుగూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు.

అపోస్తలులకార్యములు 10:15 దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను.

అపోస్తలులకార్యములు 11:2 పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు

అపోస్తలులకార్యములు 12:17 అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను

అపోస్తలులకార్యములు 15:1 కొందరు యూదయనుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.

అపోస్తలులకార్యములు 15:13 వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను సహోదరులారా, నా మాట ఆలకించుడి.

అపోస్తలులకార్యములు 21:24 నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితో కూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్నుగూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు

రోమీయులకు 14:2 ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడైయుండి, కూరగాయలనే తినుచున్నాడు.

1కొరిందీయులకు 5:11 ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను.

1కొరిందీయులకు 9:21 దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలెఉంటిని.

గలతీయులకు 2:14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవైయుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

గలతీయులకు 2:18 నేను పడగొట్టిన వాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.

కొలొస్సయులకు 2:16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పుతీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.

యాకోబు 1:1 దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.