Logo

ప్రకటన అధ్యాయము 7 వచనము 6

నిర్గమకాండము 1:2 దాను నఫ్తాలి గాదు ఆషేరు.

నిర్గమకాండము 1:3 వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.

నిర్గమకాండము 1:4 యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.

సంఖ్యాకాండము 1:4 మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను.

సంఖ్యాకాండము 1:5 మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;

సంఖ్యాకాండము 1:6 షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు

సంఖ్యాకాండము 1:7 యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను

సంఖ్యాకాండము 1:8 ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు

సంఖ్యాకాండము 1:9 జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు

సంఖ్యాకాండము 1:10 యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు

సంఖ్యాకాండము 1:11 బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను

సంఖ్యాకాండము 1:12 దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు

సంఖ్యాకాండము 1:13 ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు

సంఖ్యాకాండము 1:14 గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు

సంఖ్యాకాండము 1:15 నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.

సంఖ్యాకాండము 10:14 యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.

సంఖ్యాకాండము 10:15 ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి.

సంఖ్యాకాండము 10:16 జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.

సంఖ్యాకాండము 10:17 మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి.

సంఖ్యాకాండము 10:18 రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.

సంఖ్యాకాండము 10:19 షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి.

సంఖ్యాకాండము 10:20 గాదీయుల గోత్రసైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.

సంఖ్యాకాండము 10:21 కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచు సాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి.

సంఖ్యాకాండము 10:22 ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.

సంఖ్యాకాండము 10:23 పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్రసైన్యమునకు అధిపతి.

సంఖ్యాకాండము 10:24 గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి.

సంఖ్యాకాండము 10:25 దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుకనుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి

సంఖ్యాకాండము 10:26 ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి.

సంఖ్యాకాండము 10:27 ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్యమునకు అధిపతి.

సంఖ్యాకాండము 13:4 వారి పేళ్లు ఏవనగా రూబేను గోత్రమునకు

సంఖ్యాకాండము 13:5 జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;

సంఖ్యాకాండము 13:6 యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు;

సంఖ్యాకాండము 13:7 ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;

సంఖ్యాకాండము 13:8 ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;

సంఖ్యాకాండము 13:9 బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;

సంఖ్యాకాండము 13:10 జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;

సంఖ్యాకాండము 13:11 యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;

సంఖ్యాకాండము 13:12 దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు;

సంఖ్యాకాండము 13:13 ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;

సంఖ్యాకాండము 13:14 నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;

సంఖ్యాకాండము 13:15 గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.

సంఖ్యాకాండము 13:16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.

1కొరిందీయులకు 2:1 సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.

1కొరిందీయులకు 2:2 నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.

1దినవృత్తాంతములు 2:1 ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను

మత్తయి 1:2 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను;

మార్కు 13:27 అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగుచేయించును.