Logo

ప్రకటన అధ్యాయము 9 వచనము 8

యోవేలు 2:4 వాటి రూపములు గుఱ్ఱముల రూపముల వంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును.

యోవేలు 2:5 రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరములమీద గంతులు వేయుచున్నవి.

నహూము 3:17 నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరిపోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు.

దానియేలు 7:4 మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.

దానియేలు 7:8 నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్నకొమ్ము వాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.

యెషయా 13:4 బహుజనులఘోషవలె కొండలలోని జనసమూహమువలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరిశబ్దము వినుడి సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు

యిర్మియా 51:27 దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱములను దానిమీదికి రప్పించుడి.

యోవేలు 1:6 లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.

ప్రకటన 4:4 సింహాసనము చుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.