Logo

యెహోషువ అధ్యాయము 15 వచనము 8

యెహోషువ 18:16 ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్‌ హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్‌హిన్నోము లోయమార్గమున యెబూ సీయుల ప్రదేశమువరకు సాగి ఏన్‌రోగేలువరకు వ్యాపించెను.

2రాజులు 23:10 మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్‌ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను.

2దినవృత్తాంతములు 28:3 మరియు అతడు బెన్‌ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.

యిర్మియా 7:31 నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.

యిర్మియా 7:32 కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టుటకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 19:2 నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.

యిర్మియా 19:6 ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్‌ హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు.

యిర్మియా 19:14 ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులోనుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను.

యెహోషువ 15:63 యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

యెహోషువ 18:28 వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.

న్యాయాధిపతులు 1:8 యూదావంశస్థులు యెరూషలేముమీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిరి.

న్యాయాధిపతులు 1:21 యెరూషలేములో నివసించు యెబూసీ యులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీ యులు బెన్యామీనీయులతో కూడ నేటివరకు యెరూషలేములో నివసించుచున్నారు.

న్యాయాధిపతులు 19:10 అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్లి, యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్ట బడిన రెండు గాడిదలును

యెహోషువ 18:16 ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్‌ హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్‌హిన్నోము లోయమార్గమున యెబూ సీయుల ప్రదేశమువరకు సాగి ఏన్‌రోగేలువరకు వ్యాపించెను.

2సమూయేలు 5:18 ఫలిష్తీయులు దండెత్తివచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా

2సమూయేలు 5:22 ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా

యెషయా 17:5 చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును

1దినవృత్తాంతములు 11:15 ముప్పదిమంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతికొండ గుహలోనుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగియుండెను.

నెహెమ్యా 11:30 జానోహలోను అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.