Logo

యెహోషువ అధ్యాయము 15 వచనము 60

యెహోషువ 18:14 అక్కడనుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్‌హోరోనుకును ఎదురుగా నున్న కొండనుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనగా కిర్యత్యారీమువరకు వ్యాపించెను, అది పడమటిదిక్కు.

1సమూయేలు 7:1 అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మందసమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి.

యెహోషువ 9:17 ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణము లకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయే రోతు కిర్యత్యారీము అనునవి.

న్యాయాధిపతులు 18:12 అందుచేతను నేటివరకు ఆ స్థల మునకు దానీయులదండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట నున్నది.

2సమూయేలు 6:2 బయలుదేరి, కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తనయొద్దనున్న వారందరితో కూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను.

1దినవృత్తాంతములు 2:50 ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,

1దినవృత్తాంతములు 13:6 కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.

యిర్మియా 26:20 మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.