Logo

యెహోషువ అధ్యాయము 15 వచనము 44

1సమూయేలు 23:1 తరువాత ఫిలిష్తీయులు కెయీలామీద యుద్ధము చేసి కల్లములమీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను.

1సమూయేలు 23:2 అంతట దావీదు నేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.

1సమూయేలు 23:3 దావీదుతో కూడియున్న జనులు మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగా నున్నది; ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కెయీలాకు మేము వచ్చినయెడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా

1సమూయేలు 23:4 దావీదు మరల యెహోవా యొద్ద విచారణ చేసెను నీవు లేచి కెయీలాకు వెళ్లుము, ఫిలిష్తీయులను నీచేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా

1సమూయేలు 23:5 దావీదును అతని జనులును కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని లెస్సగా హతముచేసి వారి పశువులను దోచుకొనివచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్థులను రక్షించెను.

1సమూయేలు 23:6 అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేతపట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదునొద్దకు వచ్చెను.

1సమూయేలు 23:7 దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములును అడ్డుగడలునుగల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడియున్నాడు, దేవుడతనిని నాచేతికి అప్పగించెననుకొనెను.

1సమూయేలు 23:8 కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపించెను.

1సమూయేలు 23:9 సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను.

1సమూయేలు 23:10 అప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడుచేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడియున్నది.

1సమూయేలు 23:11 కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను.

1సమూయేలు 23:12 కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను.

1సమూయేలు 23:13 అంతట దావీదును దాదాపు ఆరువందల మందియైన అతని జనులును లేచి కెయీలాలోనుండి తరలి, ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్లిరి. దావీదు కెయీలాలోనుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్లక మానెను.

1సమూయేలు 23:14 అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని నప్పగించలేదు.

ఆదికాండము 38:5 ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను.

మీకా 1:14 మోరెషెత్గతు విషయములో మీరు విడుదల కైకోలు ఇయ్యవలసి వచ్చును, అక్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై యుండును.

మీకా 1:15 మారేషా నివాసీ, నీకు హక్కుదారుడగు ఒకని నీయొద్దకు తోడుకొనివత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు.

1దినవృత్తాంతములు 4:19 మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.

2దినవృత్తాంతములు 11:8 మారేషా, జీపు, అదోరయీము,

2దినవృత్తాంతములు 14:9 కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.

నెహెమ్యా 3:17 అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను; అతని ఆనుకొని తన భాగములో కెయిలా యొక్క సగముభాగమునకు అధిపతియైన హషబ్యా బాగుచేయువాడాయెను.