Logo

యెహోషువ అధ్యాయము 18 వచనము 5

యెహోషువ 15:1 యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరి హద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.

యెహోషువ 15:2 దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణదిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను.

యెహోషువ 15:3 అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీనువరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోనువరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయువైపు తిరిగి

యెహోషువ 15:4 అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరి హద్దు.

యెహోషువ 15:5 దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను.

యెహోషువ 15:6 ఆ సరిహద్దు బేత్‌ హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను.

యెహోషువ 15:7 ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణతీరముననున్న అదుమ్మీము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తరదిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షే మెషు నీళ్లవరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలునొద్ద నుండెను.

యెహోషువ 15:8 ఆ సరిహద్దు పడమట బెన్‌హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది.

యెహోషువ 15:9 ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.

యెహోషువ 15:10 ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.

యెహోషువ 15:11 ఉత్తరదిక్కున ఆ సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును ఆ సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను.

యెహోషువ 15:12 పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.

యెహోషువ 19:1 రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.

యెహోషువ 19:2 వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా

యెహోషువ 19:3 హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా

యెహోషువ 19:4 సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా

యెహోషువ 19:5 బేత్లెబాయోతు షారూ హెను అనునవి,

యెహోషువ 19:6 వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణ ములు.

యెహోషువ 19:7 అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.

యెహోషువ 19:8 దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.

యెహోషువ 19:9 షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.

యెహోషువ 16:1 యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు యెరికో యెదుట యొర్దాను దరినుండెను,

యెహోషువ 17:18 మీకు అధికబలముగలదు, మీకు ఒక్కవంతు చీటియేకాదు; ఆ కొండ మీదే, అది అర ణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదే శము మీదగును; కనానీయులకు ఇనుపరథములుండినను వారు బలవంతులైయుండినను మీరు వారి దేశమును స్వాధీన పరచుకొనగలరనెను.

ఆదికాండము 13:1 అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడ నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్లెను.

1రాజులు 11:28 అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా యౌవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను.

సామెతలు 16:33 చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.

యిర్మియా 13:19 దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్టబడిరి; ఏమియు లేకుండ సమస్తము కొనిపోబడెను.

ఆమోసు 5:6 యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనము చేయును.