Logo

యెహోషువ అధ్యాయము 18 వచనము 6

యెహోషువ 18:8 ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితోమీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి; అప్పుడు నేను షిలోహులో మీకొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెద ననగా

యెహోషువ 18:10 వారికొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వారి వంతులచొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచి పెట్టెను.

యెహోషువ 14:2 మోషేద్వారా యెహోవా ఆజ్ఞాపించి నట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమ్మిది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి.

సంఖ్యాకాండము 26:54 తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆ యా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 26:55 చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.

సంఖ్యాకాండము 33:54 మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రములచొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.

సంఖ్యాకాండము 34:13 మోషే ఇశ్రాయేలీయులతో మీరు చీట్లచేత పొందబోవుచున్న దేశము ఇది. యెహోవా తొమ్మిది గోత్రములకును అర్ధగోత్రమునకును దీనినియ్యవలెనని ఆజ్ఞాపించెను;

కీర్తనలు 105:11 కొలవబడిన స్వాస్థ్యముగా కనానుదేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను

సామెతలు 16:33 చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.

సామెతలు 18:18 చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును.

అపోస్తలులకార్యములు 13:19 మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.

యెహోషువ 18:4 ప్రతి గోత్రమునుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించినయెడల నేను వారిని పంపెదను; వారు లేచి దేశ సంచారము చేయుచు ఆ యా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నాయొద్దకు తీసికొనివచ్చెదరు.

యెహోషువ 19:1 రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.

యెహోషువ 19:10 మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.

యెహోషువ 21:8 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్లవలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి.