Logo

యెహోషువ అధ్యాయము 18 వచనము 26

న్యాయాధిపతులు 10:17 అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి యుండిరి. ఇశ్రాయేలీయులును కూడుకొని మిస్పాలో దిగియుండిరి.

యెహోషువ 9:17 ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణము లకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయే రోతు కిర్యత్యారీము అనునవి.

ఎజ్రా 2:25 కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,

యెహోషువ 11:3 తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయుల కును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న యెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువనుండు హివ్వీయులకును వర్తమానము పంపగా

న్యాయాధిపతులు 19:13 మరియు అతడునీవు రమ్ము,ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని యీ రాత్రి బస చేసెదమనెను.

న్యాయాధిపతులు 20:1 అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.

1రాజులు 15:22 అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటిచేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.

2దినవృత్తాంతములు 16:6 అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరిని సమకూర్చెను; వీరు పోయి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసికొనివచ్చిరి, వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకార పురములుగా కట్టించెను.