Logo

2సమూయేలు అధ్యాయము 6 వచనము 8

1దినవృత్తాంతములు 13:11 యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్‌1 ఉజ్జా అని పేరు.

1దినవృత్తాంతములు 13:12 ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది దేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొనిపోవుదుననుకొని, మందసమును

యోనా 4:1 యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని

యోనా 4:9 అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.

1దినవృత్తాంతములు 15:13 ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవాయొద్ద విధినిబట్టి విచారణ చేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.

కీర్తనలు 119:120 నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.

విలాపవాక్యములు 3:39 సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?

లూకా 8:37 గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనెయెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.