Logo

2సమూయేలు అధ్యాయము 17 వచనము 7

సామెతలు 31:8 మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము.

1రాజులు 12:10 అప్పుడు అతనితో కూడ ఎదిగిన ఆ యౌవనస్థులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్ము నా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును.

2దినవృత్తాంతములు 10:10 అతనితో కూడ పెరిగిన యీ యౌవనస్థులు అతనితో ఇట్లనిరి నీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగా నా చిటికెనవ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును;

సామెతలు 27:14 వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును.