Logo

2రాజులు అధ్యాయము 8 వచనము 6

2రాజులు 9:32 అతడు తలయెత్తి కిటికీతట్టు చూచి నా పక్షమందున్నవారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.

ఆదికాండము 37:36 మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి.

1దినవృత్తాంతములు 28:1 గోత్రముల పెద్దలను, వంతులచొప్పున రాజునకు సేవచేయు అధిపతులను సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజుకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తిమీదను స్థిరాస్తిమీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని రాజునొద్ద నున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమశాలులనందరిని రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను.

ద్వితియోపదేశాకాండము 22:2 నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయినయెడలను, నీవు అతని నెరుగకపోయినయెడలను దానిని నీ యింటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దాని వెదకుచు వచ్చువరకు అది నీయొద్ద నుండవలెను, అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెను.

న్యాయాధిపతులు 11:13 అమ్మోనీయుల రాజుఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమా ధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించు మని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.

2సమూయేలు 9:7 అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువని సెలవియ్యగా

సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

సామెతలు 21:1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలవలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును.

2రాజులు 8:3 అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములోనుండి వచ్చి తన యింటినిగూర్చియు భూమినిగూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.