Logo

2రాజులు అధ్యాయము 14 వచనము 1

2రాజులు 14:15 యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2రాజులు 13:10 యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను.

1దినవృత్తాంతములు 3:12 యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు

2దినవృత్తాంతములు 25:1 అమజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యిరువది తొమ్మిది సంవత్సరములు యెరూషలేములో ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలు, ఆమె పేరు యెహోయద్దాను.

2దినవృత్తాంతములు 25:2 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణహృదయముతో ఆయనను అనుసరింపలేదు.

2దినవృత్తాంతములు 25:3 రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను.

2దినవృత్తాంతములు 25:4 అయితే తండ్రులు పిల్లలకొరకును పిల్లలు తండ్రులకొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపముకొరకు తానే చావవలెనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న యెహోవా ఆజ్ఞనుబట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను.

2రాజులు 14:17 యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.