Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 15 వచనము 4

1దినవృత్తాంతములు 6:16 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.

1దినవృత్తాంతములు 6:17 గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.

1దినవృత్తాంతములు 6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

1దినవృత్తాంతములు 6:19 మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా

1దినవృత్తాంతములు 6:20 గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,

1దినవృత్తాంతములు 6:49 అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను.

1దినవృత్తాంతములు 6:50 అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,

1దినవృత్తాంతములు 12:26 లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.

1దినవృత్తాంతములు 12:27 అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడు వందలమంది.

1దినవృత్తాంతములు 12:28 పరాక్రమశాలియైన సాదోకు అను యౌవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.

నిర్గమకాండము 6:16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

నిర్గమకాండము 6:17 గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.

నిర్గమకాండము 6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

నిర్గమకాండము 6:19 మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.

నిర్గమకాండము 6:20 అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

నిర్గమకాండము 6:21 ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ

నిర్గమకాండము 6:22 ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.

సంఖ్యాకాండము 3:4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రియైన అహరోను ఎదుట యాజకసేవ చేసిరి.

నెహెమ్యా 12:27 యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి