Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 15 వచనము 9

1దినవృత్తాంతములు 6:2 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

1దినవృత్తాంతములు 23:12 కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

1దినవృత్తాంతములు 23:19 హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.

1దినవృత్తాంతములు 26:23 అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.

1దినవృత్తాంతములు 26:30 హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమశాలులును వేయిన్ని యేడువందల సంఖ్య గలవారు, వీరు యొర్దాను ఈవల పడమటివైపుననుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవనుగూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పని విషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి.

1దినవృత్తాంతములు 26:31 హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల యింటిపెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి.

నిర్గమకాండము 6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

సంఖ్యాకాండము 26:58 లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీయుల వంశము.