Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 15 వచనము 11

1దినవృత్తాంతములు 12:28 పరాక్రమశాలియైన సాదోకు అను యౌవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.

1దినవృత్తాంతములు 18:16 అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;

1సమూయేలు 22:20 అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి

1సమూయేలు 22:21 సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా

1సమూయేలు 22:22 దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా.

1సమూయేలు 22:23 నీవు భయపడక నాయొద్ద ఉండుము, నాయొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయ చూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.

2సమూయేలు 8:17 అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;

2సమూయేలు 15:24 సాదోకును లేవీయులందరును దేవుని నిబంధన మందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవువరకు నిలిచెను.

2సమూయేలు 15:25 అప్పుడు రాజు సాదోకును పిలిచి దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి

2సమూయేలు 15:26 దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి

2సమూయేలు 15:27 యాజకుడైన సాదోకుతో ఇట్లనెను సాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.

2సమూయేలు 15:28 ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్యమందలి రేవులదగ్గర నిలిచియుందును.

2సమూయేలు 15:29 కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి.

2సమూయేలు 15:35 అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.

2సమూయేలు 20:25 అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖికుడు

1రాజులు 2:35 రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను.

1దినవృత్తాంతములు 15:5 లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,

1దినవృత్తాంతములు 15:6 మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,

1దినవృత్తాంతములు 15:7 గెర్షోను సంతతివారి కధిపతియగు యోవేలును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,

1దినవృత్తాంతములు 15:8 ఎలీషాపాను సంతతివారి కధిపతియగు షెమయాను వాని బంధువులలో రెండువందల మందిని,

1దినవృత్తాంతములు 15:9 హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని

1దినవృత్తాంతములు 15:10 ఉజ్జీయేలు సంతతివారి కధిపతియగు అమ్మినాదాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.

యెహోషువ 3:3 మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను.

యెహోషువ 3:8 మీరు యొర్దాను నీళ్లదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞా పించుము.

యెహోషువ 8:33 అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండయెదుటను నిలువగా యెహోషువ

1రాజులు 2:26 తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.

1రాజులు 8:3 ఇశ్రాయేలీయుల పెద్దలందరును రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి

1దినవృత్తాంతములు 15:7 గెర్షోను సంతతివారి కధిపతియగు యోవేలును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,

1దినవృత్తాంతములు 15:8 ఎలీషాపాను సంతతివారి కధిపతియగు షెమయాను వాని బంధువులలో రెండువందల మందిని,

1దినవృత్తాంతములు 23:8 పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు

1దినవృత్తాంతములు 24:3 దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.

కీర్తనలు 119:99 నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.