Logo

యోబు అధ్యాయము 27 వచనము 7

1సమూయేలు 25:26 నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడుచేయ నుద్దేశించువారును నాబాలువలె ఉందురు గాక.

2సమూయేలు 18:32 రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగా నా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చినవారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక.

దానియేలు 4:19 అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావమువలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తెషాజరు నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,

యోబు 10:15 నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

యోబు 16:17 ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది నా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.