Logo

యోబు అధ్యాయము 27 వచనము 11

యోబు 4:3 అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు.

యోబు 4:4 నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొనియుండెను. క్రుంగిపోయిన మోకాళ్లు గలవానిని నీవు బలపరచితివి.

యోబు 6:10 అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దానిబట్టి హర్షించుదును

యెషయా 8:11 ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను

యోబు 32:8 అయినను నరులలో ఆత్మ ఒకటియున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును.

యోబు 32:9 వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారు కారు.

యోబు 32:10 కావున నేను నా మాట నంగీకరించుడని మనవి చేసికొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.

ద్వితియోపదేశాకాండము 4:5 నా దేవుడైన యెహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.

కీర్తనలు 71:17 దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.

అపోస్తలులకార్యములు 20:20 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,

యోబు 20:3 నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

యోబు 38:2 జ్ఞానములేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు?