Logo

యోబు అధ్యాయము 27 వచనము 8

యోబు 11:20 దుష్టుల కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.

యోబు 13:16 ఇదియు నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.

యోబు 15:34 భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును

యోబు 20:5 ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

యోబు 31:3 దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.

యెషయా 33:14 సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును?

యెషయా 33:15 నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తనచేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును.

మత్తయి 16:26 ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?

మత్తయి 23:14 మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశింపనియ్యరు.

మార్కు 8:36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?

మార్కు 8:37 మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?

లూకా 9:25 ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?

లూకా 12:20 అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.

లూకా 12:21 దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.

1తిమోతి 6:9 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

1తిమోతి 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

యాకోబు 5:1 ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి.

యాకోబు 5:2 మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.

యాకోబు 5:3 మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.

యోబు 5:3 మూఢుడు వేరుతన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమని కనుగొంటిని.

యోబు 8:13 దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.

యోబు 14:19 జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.

యోబు 35:13 నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.

యోబు 36:13 అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.

కీర్తనలు 66:18 నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల ప్రభువు నా మనవి వినకపోవును.

కీర్తనలు 73:17 నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.

కీర్తనలు 120:3 మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.

ప్రసంగి 5:8 ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు.

ప్రసంగి 9:4 బ్రదికియుండువారితో కలిసిమెలిసి యున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.

యెషయా 1:15 మీరు మీచేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీచేతులు రక్తముతో నిండియున్నవి.

యెహెజ్కేలు 20:31 నేటివరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే; ఇశ్రాయేలీయులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు

హోషేయ 5:15 వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకువరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు.

మత్తయి 6:5 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 13:21 అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును.

మార్కు 4:17 అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు.

లూకా 12:1 అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి

లూకా 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

యోహాను 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.

రోమీయులకు 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

రోమీయులకు 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

కొలొస్సయులకు 4:2 ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.

యాకోబు 4:3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.