Logo

ఆదికాండము అధ్యాయము 16 వచనము 4

1సమూయేలు 1:6 యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువును బట్టి, ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.

1సమూయేలు 1:7 ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.

1సమూయేలు 1:8 ఆమె పెనిమిటియైన ఎల్కానా హన్నా, నీ వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనోవిచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.

2సమూయేలు 6:16 యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులువేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.

సామెతలు 30:20 జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును.

సామెతలు 30:21 భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయలేనివి నాలుగు కలవు.

సామెతలు 30:23 కంటకురాలైయుండి పెండ్లియైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి.

1కొరిందీయులకు 4:6 సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకనిమీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నామీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను.

1కొరిందీయులకు 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

1కొరిందీయులకు 13:5 అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

ఆదికాండము 16:8 శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను.

ఆదికాండము 19:31 అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు; సర్వలోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.

గలతీయులకు 4:24 ఈ సంగతులు అలంకారరూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.

1తిమోతి 6:2 విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.