Logo

ఆదికాండము అధ్యాయము 21 వచనము 26

ఆదికాండము 13:7 అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.

2రాజులు 5:20 అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన యీ నయమాను తీసికొనివచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొనిపోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని

2రాజులు 5:21 నయమానును కలిసికొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముమీదనుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి

2రాజులు 5:22 నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యమునుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరిగనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను.

2రాజులు 5:23 అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరిమీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొనిపోయిరి.

2రాజులు 5:24 మెట్లదగ్గరకు వారు రాగానే వారియొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.

ఆదికాండము 44:15 అప్పుడు యోసేపు మీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా

నిర్గమకాండము 32:1 మాషే కొండ దిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.

అపోస్తలులకార్యములు 3:17 సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.

ఫిలిప్పీయులకు 1:22 అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనయెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.