Logo

ఆదికాండము అధ్యాయము 22 వచనము 23

ఆదికాండము 24:15 అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.

ఆదికాండము 24:24 అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.

ఆదికాండము 24:47 అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేనామె ముక్కుకు కమ్మియును ఆమెచేతులకు కడియములను పెట్టి

ఆదికాండము 25:20 ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.

ఆదికాండము 28:2 నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి

ఆదికాండము 28:5 యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.

ఆదికాండము 24:51 ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొనిపొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి.

ఆదికాండము 24:60 వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేలవేలకు తల్లివగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా

ఆదికాండము 24:67 ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొనిపోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.

రోమీయులకు 9:10 అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు,

ఆదికాండము 24:48 నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను.