Logo

ఆదికాండము అధ్యాయము 35 వచనము 28

ఆదికాండము 25:7 అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.

ఆదికాండము 47:28 యాకోబు ఐగుప్తు దేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలుబదియేడు.

ఆదికాండము 50:26 యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.

ఆదికాండము 25:8 అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.

ఆదికాండము 47:9 యాకోబు నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి

నిర్గమకాండము 6:16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

యోబు 42:16 అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.