Logo

ఆదికాండము అధ్యాయము 38 వచనము 5

ఆదికాండము 38:11 అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను

ఆదికాండము 38:26 యూదా వాటిని గురుతు పట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు.

ఆదికాండము 46:12 యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.

సంఖ్యాకాండము 26:20 యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;

1దినవృత్తాంతములు 4:21 యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును

యెహోషువ 15:44 వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు. ఎక్రోను దాని గ్రామములును పల్లెలును,

యెహోషువ 19:29 అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.

నెహెమ్యా 11:5 మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను.