Logo

ఆదికాండము అధ్యాయము 6 వచనము 4

సంఖ్యాకాండము 13:33 అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.

ద్వితియోపదేశాకాండము 2:20 అదియు రెఫాయీయుల దేశమని యెంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందురు.

ద్వితియోపదేశాకాండము 2:21 వారు అనాకీయులవలె ఉన్నతదేహులు, బలవంతులైన బహు జనులు. అయితే యెహోవా అమ్మోనీయుల యెదుటనుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారిచోట నివసించిరి.

ద్వితియోపదేశాకాండము 3:11 రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.

1సమూయేలు 17:4 గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరుచుండెను. అతడు ఆరుమూళ్ల జేనెడు ఎత్తు మనిషి.

2సమూయేలు 21:15 ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరల జరుగగా దావీదు తన సేవకులతోకూడ దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను.

2సమూయేలు 21:16 అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను.

2సమూయేలు 21:17 సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిచూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి.

2సమూయేలు 21:18 అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సఫును చంపెను.

2సమూయేలు 21:19 తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటె కఱ్ఱనేతగాని దోనె అంత గొప్పది.

2సమూయేలు 21:20 ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి యెత్తరి యొకడుండెను, ఒక్కొకచేతికి ఆరేసి వ్రేళ్లును, ఇరువది నాలుగు వ్రేళ్లు అతనికుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు.

2సమూయేలు 21:21 అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను.

2సమూయేలు 21:22 ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతివారై దావీదువలనను అతని సేవకులవలనను హతులైరి.

ఆదికాండము 6:3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.

ఆదికాండము 11:4 మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా

సంఖ్యాకాండము 16:2 ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందల యేబదిమందితో మోషేకు ఎదురుగాలేచి

ఆదికాండము 6:12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.

ఆదికాండము 6:13 దేవుడు నోవహుతో -సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.

ఆదికాండము 10:9 అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.

ఆదికాండము 19:31 అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు; సర్వలోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.

ఆదికాండము 24:3 నేను ఎవరిమధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక

ఆదికాండము 38:2 అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను.

ద్వితియోపదేశాకాండము 14:1 మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడిచేసికొనకూడదు.

న్యాయాధిపతులు 15:1 కొన్నిదినములైన తరువాత గోధుమల కోతకాలమున సమ్సోను మేకపిల్ల ఒకటి తీసికొని తన భార్యను చూడ వచ్చి అంతఃపురములోనున్న నా భార్యయొద్దకు నేను పోదుననుకొనగా

2సమూయేలు 16:21 అహీతోపెలు నీ తండ్రిచేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయినయెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను.

2సమూయేలు 21:16 అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను.

1దినవృత్తాంతములు 4:38 పేళ్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరుల యిండ్లు బహుగా వర్ధిల్లెను.

1దినవృత్తాంతములు 12:30 తమ పితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.

2దినవృత్తాంతములు 22:3 దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతివారి మార్గములందు నడచెను.

యోబు 26:5 జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు.

కీర్తనలు 52:1 శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.

ప్రకటన 11:13 ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.